Tuesday, 22 November 2016

కధ-2-* చిన్ననాటి స్నేహమా -నీవెక్కడ ***

కధ సంఖ్య :2
* చిన్ననాటి స్నేహమా  -నీవెక్కడ   ***


         మనం ఎదుగుతున్నా కొద్దీ మన మనసు గడిచిన కాలం వెంట పరుగు తీస్తూ ఉంటది . అలాంటి మనసు ఎక్కువగా చిన్న నాటి జ్ఞాపకాలు అంటే వాటిని ఆస్వాదించటంలో తేలియాడుతూ ఉంటది . ఆ చిన్నతనంలో నాకు స్నేహాలు ఎక్కువే ,స్నేహితులూ ఎక్కువే . ఆ స్నేహానికి కులం ,మతం అన్నా రంగు లేదు . ఉన్నోడు -లేనోడు అనే భావన లేదు . మా పెద్ద వాళ్లు మట్టుకు  మాకు చెబుతూనే ఉండేవారు . వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు ,వీళ్ళతో 'అరేయ్ ' అని పిలిపించుకోవద్దు అని . అయినా నాకు అప్పుడు అవేమీ నా చెవికి పట్టేవి కాదు . నా కన్నా తక్కువ కులం వారితో ,వాళ్ల  ఇంటికి వెళ్లి వాళ్ళతో పాటు తిని తాగేవాడిని . ట్యూషన్లో కానీ ,స్కూల్ లో కాని చక్కటి వాతావరణం . అందరం కలిసి మెలసి ఐక్యంగా ఉండేవాళ్ళం . అన్ని జాతుల వారంతా ఒకటే ఎటువంటి బేదాభిప్రాయాలు మా మధ్య వచ్చేవి కాదు . బూతులు కూడా మేము మాట్లాడి ఎరుగం . 


వేసవి సెలవలు రాగానే నాకోసం ఎదురుచూసే కళ్లు కానీ వారంతా నాకన్నా ధనికంగా పుట్టినవాళ్లు . అయినా సరే వారి వారి అమ్మమ్మ ,తాతయ్యలు వారి పిల్లలతో పాటు నన్ను సమానంగా చూసేవారు . వారితో ఉన్నంత సేపు తిండి తినాలన్నా ధ్యాసే ఉండేది కాదు , అలాగే పొద్దుగూకటం అనే సంగతి కూడా మా చిన్నారి స్నేహాల మధ్యలో గుర్తుకొచ్చేదే కాదు . మట్టి ముద్దలతో చేసుకున్న బొమ్మలు , తాటి కాయలతో చక్రాల బండి చేసుకుని ఆదుకునే క్షణాలు . ఒక భాద్యత లేదు , ఒక గమ్యం లేదు . కడుపునిండా తిన్నామా , మంచి బట్ట కట్టుకున్నామా , హోం వర్క్ చేసుకున్నామా , స్నేహితులతో ఆడుకున్నామా అంతే తెలుసు . అంత కన్నా మా చిన్నారి హృదయాలకు ఏమీ అవసరం లేదు . ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని కొత్త స్నేహాలు నేడు మనకు పరిచయమయినా చిన్ననాటి స్నేహాల విలువే వేరు . అప్పట్లో మనకు చేరువైన స్నేహం మన మనసులో ఒక మంచి అనుబంధాన్ని పెనవేసుకుని ఉంటుంది . మనం ఎంత ఎదిగినా ,ఎంత వారమయినా మన చిన్ననాటి స్నేహం మనకు ప్రాణంతో సమానంగా కలిసిపోయి ఉంటుంది . 

ఎన్నో స్నేహాలు ఉన్న నాకు నా చిన్న నాటి స్నేహితుడు 'భరత్ ' స్నేహం మాత్రం నా జీవితాంతం వరకు గుర్తిండిపోతుంది నాలో ఆ స్నేహపు తీపి జ్ఞాపకం నా నరనరంలో జీర్ణించుకుని ఉంటుంది  . అవి నేను పాఠశాలకు వెళ్లి చదువుకునే రోజులు . నేను ఒక పల్లెటూర్లో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంది చదువుకుంటూండేవాడిని . భరత్ వాళ్ల తాతయ్య గారి ఇల్లు మా అమ్మమ్మ వారి ఇంటికెదురు . మాది పూరిళ్లు అయితే భరత్ వాళ్ల తాత గారిది పెంకుటిల్లు . వేసవి కాలం సెలవులకి భరత్ వాళ్ల తాత గారి ఇంటికి వస్తూ , నాకు బాల్య స్నేహితుడిగా  పరిచయం అయ్యి ప్రాణ స్నేహితుడిగా మారాడు . ఒకరంటే  ఒకరికి ఇష్టం ,గౌరవం ,భక్తి కూడా . మా ఇద్దరి స్నేహాన్ని మా ఇంట్లో , వాళ్ల ఇంట్లో వారు మురిసి పోయేవారు . అప్పట్లో విడుదలయిన 'కొండపల్లి రాజా ' సినిమా మా స్నేహానికి  దగ్గర పోలికలు ఉండేవి కాకపొతే మేమెప్పుడూ ఆ ముభావంగా ఉండలేదు ,  విరోధులుగా అస్సలే మారలేదు . మేమిద్దరం కలిసామంటే సమయమే తెలియదు . భోజనం ఒక్కటే ఎవరింట్లో వారు తినేవాళ్ళం ఇక ఆడుకోవటం , పడుకోవటం అన్నీ భరత్ వాళ్లింట్లోనే . సైకిల్ వేసుకుని ఎన్నో మైళ్ళు వెళ్లేవారం .పొలాలకి వెళ్లి పైరుగాలితో గడిపేవారం . దీపావళికి కొనుక్కున్న టపాసులు అర్ధరాత్రి వరకూ కాల్చుకుంటూ ఉండేవాళ్ళం . గార్డెనింగ్ అని , భవంతులు అని మొక్కలతో , రాళ్లతో ఎంతో అందంగా అమర్చుకునేవాళ్ళం . క్రికిట్ ,బిజినెస్ గేమ్స్ అంటూ సరదాగా ఆడుకునేవాళ్ళం . ఎన్నో రకాల ఆటలను కొత్తగా మాకు మేమె కనిపెట్టుకుని - ఆడుకుని అందరికీ తెలియచెప్పేవాళ్ళం . అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు (చర వాణి ). వేసవి సెలవలు పూర్తయ్యి మేము మరలా స్కూల్ కెళ్లేటప్పుడు కాస్త బాధ అనిపించినా , తిరిగి మరలా కలుసుకునే సరికి అంత రెట్టింపు ఉత్సాహం , ఆనందం మాలో జతకూడేవి . 

అలా అలా మేము ఇంటర్ వరకూ తరచూ వేసవి కాలం సెలవులకి కలుస్తూ ఉండేవాళ్ళం . మేము పెరిగిన మా పల్లెటూరు గురించి మా చిన్ననాటి ముచ్చట్లలో ఏదో మంచి చెయ్యాలని కొన్ని కొన్ని ఊహాత్మకంగా ప్రణాళిక వేసుకునేవాళ్ళం . మా ఇద్దరి చిన్ననాటి  స్నేహం మాతో పాటు , కాలంతో ఎదుగుతూ వస్తుంది . కాలక్రమేణ మా చదువుల దృష్ట్యా మేము దూరం అవ్వాల్సి వచ్చింది . నేను తనకంటే సంపదలో చాలా తక్కువ అంటే శ్రీ కృష్ణునికి కుచేలుని స్నేహాం లాగా . అలా కొన్ని రోజుల వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి సమాచారాలు లేవు . అప్పుడప్పుడూ తనే నాకు ఫోన్ చేస్తుండేవాడు . ఒకసారి ఎప్పుడో తను నాకు face book లో కలిసాడు. అప్పటికే తాను us లో చదువుకుంటున్నాడు . నేను డిగ్రీ తర్వాత , మా కుటుంబ పరిస్థితి దృష్ట్యా చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని . ఆ తర్వాత మేము 2 - 3 సార్లు కలుసుకున్నాం తను నా కన్నా వయసులో చిన్న - తను నన్ను పేరు పెట్టి పిలిచేవాడు . నేనూ మామూలుగానే తనతో మాట్లాడుతూ ఉండేవాడిని . అయితే మా స్నేహంలో ఇంతవరకూ మేము 'అరేయ్ -ఒరేయ్ '  అనుకున్న సందర్భమే లేదు . అలా మేము కలిసినప్పుడు మా జీవితంలో జరిగినవి , జరగాల్సినవి మా ఆశయాలు - ప్రణాళికలు గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళం . అప్పటికీ తనలో ఏ మార్పు కనపడలేదు చిన్నప్పటి మా స్నేహం ఎలా ఉండేదో అలానే మా స్నేహం ఇంకా నిలచే ఉందని ఒక  నమ్మకం , సంతోషం ఇంకా బలపడినవి . 

అలా 5-6 సంవత్సరముల తర్వాత నేను హైదరాబాద్ లో ఒక ప్రెవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని . గతకాలంతో పోల్చుకుంటే ఇప్పటి నా position పరవాలేదు . నేను ఈ సంస్థలో చేస్తూనే పెళ్లి చేసుకున్నాను తనని నా పెళ్ళికి ఆహ్వానిద్దామంటే తను US లో ఉంటున్నాడు అని మాత్రమే తెలుసు తర్వాత అప్పుడప్పుడు తను నాకు కాల్స్ చేస్తూ ఉండేవాడు . ఒకసారి తను US నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడాడు . కలుస్తాడేమో అనుకున్నా అప్పటికే నాకన్నా తనకి ఇంకా మంచి స్నేహితులు చాలా మంది ఉన్నారు . వాళ్లతో కలిసి హైదరాబాద్ మొత్తం తిరిగాడు మరలా తక్కువ సమయంలో తను US కి వెళ్ళిపోయాడు . నాకు వివాహం అయ్యిన సంవత్సరం తర్వాత తనకి కూడా పెళ్లి set అయ్యింది దానికి నేను చాలా సంతోషించాను . personal గా కలిసి నన్ను ఆహ్వానిస్తాడని చూసాను తనకి అంత సమయం లేకపోవటం వలన ఫోన్ చేసి వివరంగా చెప్పాడు . facebook లో సందేశం పంపాడు . అయితే నా ఉద్యోగ రీత్యా ఖచ్చితంగా తన పెళ్ళికి వెళదాం అని ముందు నుంచే అనుకున్నా తన పెళ్లి రోజు వెళ్లలేక పోయాను . 

ఇక కట్ చేస్తే తను US లో తన భార్య తో happy గా settle అయ్యాడు మంచి ఉద్యోగం చేసుకుంటూ .నేనూ happy గానే ఉంటున్నా  నా అర్ధాంగి తో హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఇక మా స్నేహం అంటారా అప్పుడప్పుడూ  facebook లో హాయ్ చెప్పుకోవటం వరకే . రాను రాను జీవితంలో భాద్యతలు పెంచుకుంటూ పోయే సమయంలో కొంతమందికి మనం  దూరం కాక తప్పదు అలానే మా స్నేహంలో కూడా  దూరం దగ్గరికి చేరుతూ వచ్చింది . అయితే ఇక్కడ నేను తన పలరింపు కోసం , తన స్నేహం కోసం ఎదురుచూస్తూ ''చిన్నారి స్నేహామా చిరునామా తీసుకో - గతమైన జీవితం కథగానే రాసుకో '' అంటూ తన స్నేహం కోసం నిరీక్షించే ఒక చిన్ననాటి స్నేహితుడి ని . ఇంతకీ నా పేరు  చెప్పలేదు కదూ నా పేరు 'రాజా' 

ప్రస్తుతానికి ఇంతవరకే మా చిన్ననాటి స్నేహం కధ ఇక ముందు ఏమవుతుందో , ఏ మలుపు తిరుగుతుందో నాకు కూడా  తెలియదు సుమండీ ! 
- గరిమెళ్ళ గమనాలు // 24. 11. 2016//
******************* ధన్యవాదములు **************************

Sunday, 20 November 2016

కధ - 1-

కధ సంఖ్య 1 

ఆఫీసు నుండి ఫుల్ గా అలసిపోయి ఇంటికి వెళ్ళాక happy గా ఆ అలసట తీర్చుకుంటూ , కాసేపు టీవీ చూసుకుంటూ , నా  అలసట తీర్చుకుందాం అనుకుంటే ఎప్పుడూ అది కుదిరేది కాదు ఎందుకంటే మా ఇంట్లో ఒకటే చప్పుడూ చేసుకుంటూ ,కిర్ కిర్ అంటూ మా ఇల్లు మొత్తం బొగ్గుతో నింపిన రైలు ఇంజన్  లాగా ఓ తెగ తిరుగుతా  ఉంటుంది అదే అదే మాయదారి ఎలుక , మా ఇంట్లోనే దీని స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది . అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎలుకలు ఉంటే ఎక్కువ టెన్షన్ తీసుకునే వాళ్ళం కాదు . ఒక మంచి జంగిర్ పిల్లిని ఇంట్లో పెంచుకుంటే చాలు ఆ ఎలుకలు , పందికొక్కుల బాధ ,బెడద మా  బుజ్జి పిల్లి చూసుకునేది . మా అమ్మమ్మ , తాతయ్య వాళ్లు ఆ పిల్లికి సకల మర్యాదలు చేస్తూ , మేము తింటున్నప్పుడు మాతో పాటు దానికి కూడా పక్కన చిన్న కంచం పెట్టి పుష్టిగా భోజనం పెట్టేవారం . ఇప్పుడేమో ఉండేది పట్నం లో ఇక్కడ పిల్లులు జాడే కనపడదు అది ఈ ఎలుకలకు తెలుసో ఏమో మాతో తెగ ఆట , పాట డైలీ -2 షో లు వేసుకుంటాయి . 

మాకున్న బిజీ పనులతో ఈ ఎలుక అల్లరి అంతగా పట్టించుకోలేము . పోనీ దానిని బెదరగొడదామన్నా కూడా బెదరదు . అలా బెదిరించి దానిని ఇంటి నుంచి పంపటంలో విఫలమయితే ఇక చూసుకోండి మనల్ని ఒకచోట కూర్చోనివ్వదు రాత్రి అయితే తీరికగా పడుకోనివ్వదు .

ఇది మామూలు ఎలుక కాదండి ఇది చేసే అల్లరికి మన మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే . వంటగది , ఆగది - ఈ గది అంటూ ఇల్లు మొత్తం కలియతిరుగుతూ పట్టుకునే లోపు తుర్రుమంటూ చేజారిపోతుంది . ఆపై ఒక మూల చేరి తలతో నానారకాలుగా వెక్కిరిస్తుంది . పప్పు ,ఉప్పు డబ్బాల వెమ్మట తిరిగి ఢమ ఢమ మోత చేస్తూ ఉంటుంది . బియ్యపు బస్తా ఉంటే దానికి కొరికి ఇల్లంతా చిమ్ముతూ ఉంటుంది . బట్టలలో చేరి కొరకటం .ఏమైనా తినేవి భద్రంగా దాచుకుంటే వాటిని కొరికి కొరికి పప్పు చేయటం , సూట్ కేసులు , అట్ట పెట్టెలను గీరుతూ ఒకటే శబ్దం చేయటం . మేము ఇంట్లో ఉండి ఆ సమయంలో గద్దిస్తే గమ్మున ,ఉండటం