Monday, 27 February 2017

కధ -3

కధ -3

ప్రేమ ఎప్పుడూ అందంగానే కనపడుతూ ఉంటుంది . ప్రేమ కధలు కూడా ఎన్నో అందంగానే ఉంటాయి కానీ ముగింపు ప్రేమికుల చేతుల్లో ఉంటుంది ఆ ముగింపు కొన్ని కధల్లో సుఖాంతం ఉంటే మరి కొన్ని కధల్లో విషాదం గా మారుతుంది మరి కొన్ని ఎటువంటి ముగింపు లేకుండా అలా తటస్తం గా ఉండిపోతాయి  . మరి ఇప్పుడు మనం చూడబోయే ప్రేమ కధ ఎటువంటి మలుపులకు చేరిందో చూద్దాం ....

అప్పుడే 10 వ తరగతి ప్రధమ ఉత్తీర్ణతతో సిటీ కాలేజ్ (కళా శాల) లోకి అడుగుపెట్టాడు మన కథానాయకుడు  'రాజా రావు '. అందరూ ముద్దుగా 'రాజ్ ' అని పిలుస్తుంటారు . ఎరుపు -గోధుమ రంగు కలిసిన శరీరపు చాయ  , 5.08 అడుగుల ఎత్తు .మంచి శరీర దారుఢ్యం . చలాకీతనం ,  కొంచెం హాస్య చతురత , ఆడవాళ్ళ  యందు ముభావమైన స్వభావం . చదువులో ముందంజ లో ఉండాలనే పట్టుదల , మంచి ఒత్తైన జుట్టు ,ఆక్షరించే వస్త్రధారణ ,  అప్పుడే పక్వానికి వస్తున్న యవ్వనం అంటే వయసు 15 సం //లు . మనసులోని భావాలను ఒడిసిపట్టి చెప్పగలిగే తత్వం 'కవిత్వం '

 ఇక మన కదానాయకి విషయానికి వస్తే నామధేయం 'కళా వతి ' అందరూ ముద్దుగా 'కళా ' అని పిలుస్తుంటారు
చంద్రబింబం ఆమె మోము ,మందారపు  సొగసులు అద్దిన మేను , చేప కళ్లు , మయూరం లాంటి నడక .  కోయిలస్వరం , దోరపండు లాంటి పెదాలు , నవ్వితే ముత్యాలు జారేనేమో అనిపించే దరహాసం . అందానికే కొత్త అర్ధం చెప్పే ఆమె లావణ్యం ఇంకా ఎక్కువ  వద్దులెండి . ఈమె వయసు కూడా 15 సం //లే కాకపోతే మన కదా నాయకుడికి ,ఈమె కి కొన్ని మాసాల గ్యాప్ అంతే . ఇద్దరూ  చదివేది ఇంటర్ ,మొదటి  సంవత్సరం గ్రూప్ ఎం. పి . సి
ఈమె కూడా చదువులో ప్రధమ శ్రేణిలో ఉండే రకమే .ఈమె అని ఎందుకు 'కళ ' అని  సంబోదిద్దాం లే . కళ కళాశాల  నుండి 6-7 కి //మీ దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి వస్తుంది . మన రాజ్ కాలేజ్ ఉండే సిటీలోనే కొద్దిదూరం నుంచి వస్తూ ఉంటాడు .

'రాజ్ ' చేరిన ఒక వారం తర్వాత 'కళ ' కాలేజ్ లో చేరింది . కాలేజ్ అన్నాక క్లాసెస్ స్టార్ట్ అవ్వటమూ , పిరియడ్స్ వారీగా లెక్చరర్స్ వస్తూ ,పోవటమూ మన 'రాజ్ ' కళ ' ఉన్న క్లాసెస్ లో ఉండే తోటి విద్యార్థులు కాస్త అల్లర్లు చెయ్యటం మరి మన మాష్టర్లు కూడా వారిని  హెచ్చరిస్తూ ,వారి పాఠాలను కొనసాగిస్తూ ముందుకు పోవటం జరుగుతుంది . మరి మన రాజ్ తో పాటు ఉండే స్నేహితులు అందరూ బుద్ధిమంతులే . క్లాస్ లో ఉన్నంత సేపు లెక్చరర్స్ ని , తోటి విద్యార్థులని హేళన చెయ్యటం , సినిమాలకు , షికార్లకు క్లాస్ బంక్ కొట్టి గోడలు దూకి వెళ్ళటం వరకే  తెలుసు . అమ్మాయిలు , ప్రేమలు  విషయాలకై ఆలోచన కూడా చేసేవారు కాదు .  ఇంగ్లీష్ ,తెలుగు , మాథ్స్ , ఫిజిక్స్ , కెమిస్ట్రీ ... మొ //నవి ఇలా క్లాసెస్ అన్నీ కొద్ది రోజులుగా   జరిగిపోతూ వస్తున్నాయి . లెక్చరర్స్ చెప్పేది ఏదైనా నల్ల బోర్డు మీద రాసుకుంటూ , చెప్పుకుంటూ పోయేవాళ్లు . మన విద్యార్థులు ఆ క్లాసెస్ వింటూనే రన్నింగ్ నోట్స్ రాసుకుంటా ఉండాలి . ఏదైనా మధ్యలో మిస్ అయ్యిందంటే పక్కవాళ్ల నోట్స్ చూసుకునో అప్పటికీ సబ్జెక్టు మిస్ అయితే తోటి విద్యార్థులనెవరినైనా ఆరోజుకి నోట్స్ ఇంటికి తీసుకుని వెళ్లి మరుసటి రోజు ఇచ్చెయ్యాలి . అబ్బాయిలలో  ఉంటారు కాని మేధావులు ఎవరైనా ఒక్కరో , ఇద్దరో ఉండేవారు . అదే అమ్మాయిలలో అయితే వారికి రెట్టింపు పైగా అబ్బాయిల చేతి రాత కన్నా అమ్మాయిల  చేతిరాత అందంగా ఉంటుంది అది సాధారణం ఈ సోదంతా ఎందుకు అని మాత్రం అనుకోకండి . ఇక్కడేఉంది  మన 'రాజ్ -కళ ' ల ప్రేమకు పునాది . కొద్దిగా ఆగితే మీకే అర్ధమవుతది .

ఇలా సీరియస్ గా క్లాసెస్ కి హాజరవుతున్న 'రాజ్ ' తనదైన శైలిలో హుషారుగా , ఏ క్లాస్ ని పొరపాటున కూడా మిస్ కాకుండా , చలాకీగా లెక్చరర్స్ అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాడు . ఒకరోజు ఫిజిక్స్ క్లాస్ జరుగుతుంది . లెక్చరర్ చాలా పెద్దాయన అన్నీ విడమరిచి ఒకటికి ,రెండు సార్లు చెప్పుకుంటూ  పోతాడు . ఎవరైనా అల్లరి చేస్తున్నా అంతగా పట్టించుకోరు , కానీ సబ్జెక్ట్ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఉంటారు . నోట్స్ విషయంలో బోర్డు పై రాసుకుంటూ పోతారు . విద్యార్థులు రాసుకునేంత వరకూ అయన నిరీక్షించించరు .